ఊరి పురోహితుని విగ్రహం..మీరు ఆశ్చర్య పోయే విషయం

సాధారణంగా రాజకీయనాయకులకు విగ్రహాలు పెడుతూండటం చూస్తూంటాం. లేదా అంబేత్కర్ వంటి రాజ్యంగ కర్తలకు ఊరూరా విగ్రహాలు చూస్తాం..మహాత్ముడుకి విగ్రాహాలు ఉండటం గమనిస్తాం. కానీ ఓ పురోహితుడికి విగ్రహం ఎక్కడైనా పెడతారా..అంటే అవును మా గ్రామంలో పెడతాం అటున్నారు కంభంపాడు గ్రామస్ధులు. తమ గ్రామ పౌరోహితునికి విగ్రహం పెట్టి ఆయన పై గౌరవాన్ని చాటారు పల్నాడు ప్రాంత మాచర్ల మండల కంభంపాడు ఊరివాళ్లు. పూర్తి వివరాల్లోకి వెళితే.. పల్నాడు ప్రజలు మంచి చేసిన ప్రతి ఒక్కరిని గుండెల్లో దాచుకోవటం మొదట నుంచీ అలవాటు,వారు లేకున్నా వారి జ్ఞాపకాలు తలుచుకుంటారు.. మాచర్ల మండలం కంభంపాడు గ్రామ ప్రధాన బురుజు వీధి,భొడ్రాయి బజార్ లో ఒక పౌరోహితుని కి విగ్రహం పెట్టారు. ఇక్కడ మీరు చూస్తున్న ఫొటోలో విగ్రహం అదే. ఇది చూసిన వారు ఆశ్చర్యపోయి స్తానికులను అడగ్గా ఆ పురోహితుని పేరు జక్కేపల్లి కృష్ణమూర్తి గారు అని, డబ్బు ఆశించక పేద,ధనిక భేదం లేకుండా ఇచ్చిన సంభావన మాత్రమే తీసుకుని అనేక వందల మంది కి వివాహాలు,ఇళ్ళ లో శుభకార్యాలు జరిపించేవారని తెలిపారు. ఒకప్పుడు బాగా స్తితి పరులని కాలక్రమేణా ఆస్తి కరిగిపోయినను ఏ నాడు డబ్బు కోసం చూడక గ్రామస్తుల కు శుభకార్యాలు జరిపేవారని ఒక్కరూపాయి మరియు ఒక్క కొబ్బరి చిప్ప ఇచ్చినా ఆనందంగా స్వీకరించేవారని అలా ఎంతోమంది పేదలకు మంచి ముహుర్తాలు నిర్ణయించి పెళ్ళిళ్ళు చేసారని తెలిపారు.