ఊరి పురోహితుని విగ్రహం..మీరు ఆశ్చర్య పోయే విషయం

అలాగే ఆయన చేతుల మీదుగా వివాహాలు జరిగిన వారు నేడు సుఖ:శాంతులతో ఉన్నారని వారి లో నేను ఒకడని కొరటా వెంకటేశ్వర్లు గారు అనే ఒక 80 సంవత్సరాల వృద్దుడు తెలిపారు. కృష్ణమూర్తి గారు ఏదైనా దొంగిలింపబడిన వస్తువు లేదా తప్పిపోయిన గేదెలు తన అంజనం ద్వారా ఎటు ఉన్నాయో ఖచ్చితంగా తెలిపేవారని తెలిపారు. గ్రామ ప్రజల అందరి తో మర్యాదగా వ్యవహరిస్తూ కుల,మత భేదాలు చూపక అందరిని సమానంగా చూసేవారని అందుకే ఆయన ప్రస్తుతం లేకున్నను తమ గుండెలలోను మరియు విగ్రహం రూపం లో కూడా పదిల పరిచామని తెలిపారు,గ్రామానికి చెందిన కావూరి వంశస్తులు విగ్రహం నిర్మించినట్లు తెలిపారు. పల్నాడు ప్రాంత ప్రజల ఆప్యాయతలకు ఔన్నత్యానికి చిహ్నంగా కృష్ణమూర్తి గారి విగ్రహ నిర్మాణం చెప్పవచ్చు. ఈ రోజుల్లో ఇలాంటి విశేషం గొప్పకదూ.